కంటెయినర్ ఢీకొనడంతో..
● చెరువుల్లో పడి ఇద్దరు..
● రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు
ధర్మారెడ్డిలో వివాహిత..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డిలో ఓ వివాహిత కలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరచెరువుకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. వివరాలు ఇలా.. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు పోచమ్మ(46) అనే వివాహిత సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామశివారులోని ఊరచెరువుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నారాయణ, గ్రామస్తులతో కలిసి మంగళవారం గ్రామశివారులోని ఊరచెరువులో గాలించారు. దీంతో పోచమ్మ మృతదేహం చెరువులో లభ్యమయింది. కాగా పోచమ్మ గత ఆరునెలలుగా పక్షపాతానికి గురై ఒక కాలు, ఒక చేయి పనిచేయక అనారోగ్యంతో బాధపడుతుందని ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బైక్ అదుపుతప్పడంతో..
నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామ శివారు లోని బాసర రహదారి మూల మలుపు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీ వ్రంగా గాయపడ్డారని ఎ స్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలో ని నాందేడ్ జిల్లా బోకర్ తా లూక పరిధిలోని హనుమాన్ నగర్‌కు చెందిన సుదో ధన్(22) నాలుగు నెలల నుంచి నిర్మల్ జిల్లా దిలా వర్ పూర్‌లో నివాసం ఉంటున్నారు. సుదోధన్ సో దరి శివాని నవీపేటలో ఉండడంతో సోమవారం స్నేహితుడు సతీష్ వాగ్మారేతో కలిసి బైక్‌పై నవీపేటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి నాగేపూర్ శివారులోని రహదారి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుతుపున్న సతీష్‌తో పాటు సుదోధన్ కింద కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుదోధన్ మంగళవారం ఉదయం చికిత్స పొందు తూ మృతి చెందాడు. సతీష్ వాగ్మారే చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి మనోహర్ తేజారావ్ సోన్ కాంబ్లే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
కోమట్‌పల్లిలో యువకుడు..
లింగంపేట(ఎల్లారెడ్డి) : మండలంలోని కోమట్‌పల్లి గ్రామంలో మతి స్థిమితం లేని ఓ యువకు డు చెరువులో పడి మృతిచెందాడు. వివరాలు ఇ లా.. కోమట్‌పల్లి గ్రామానికి చెందిన ధరణి బా లమల్లు–సాయవ్వల కుమారుడు నవీన్(18) మతి స్థిమితం కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. తండ్రి బాలమల్లు 11 సంవత్సరాల క్రి తం కరెంటు షాక్‌తో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సాయవ్వ కుమారుడిని పోషించు కుంటూ జీవనం కొనసాగిస్తుంది. సోమవారం సాయవ్వ కామారెడ్డికి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంట్లో కుమారుడు లేకపోవడంతో ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అతడు కనిపించలేడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఊర చెరువు కట్టపై కుమారుడి చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించారు. కొద్దిసేపటికీ నవీన్ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మతి స్థిమితం కోల్పోయి చెరువులో కాలుజారి పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు.
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్రూ మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (43) స్థానిక దాభా హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తు జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం చంద్రం బస్వాపూర్ గ్రామానికి వెళ్లాడు. తిరిగి భిక్కనూరు వచ్చేందుకు బస్వాపూర్ శివారులో రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


