అతివల ఆర్థిక ప్రగతికి బాటలు
రాయితీ రుణాలతో లబ్ధి
మోర్తాడ్(బాల్కొండ): మహిళా సంఘాల సభ్యులు చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి బ్యాంకు లింకేజీ ద్వారా భారీ మొత్తంలో రుణా లు ఇప్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. జిల్లాలో 200 యూనిట్లను మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే 60 యూనిట్లను ఏర్పాటు చేయగా మిగిలిన లక్ష్యం పూర్తి చేసేందుకు మహిళ సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీం(పీఎంఎఫ్‌ఎంఈ), ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ ప్రాజెక్టు(పీఎంఈజీపీ) పథకాల కింద బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల వరకు రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రుణం పొందిన మొత్తంలో కేంద్రం 30 శాతం సబ్సిడీని అందించనుంది. రూ.10 లక్షల రుణానికి రూ.3 లక్షల రాయితీ లభిస్తుండటం మహిళలకు ఎంతో కలిసి వచ్చే అంశమని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పా టు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారీ మొత్తంలో రుణాలు పంపిణి చేస్తే చిన్న తరహా పరి శ్రమలను ఏర్పాటు చేసుకొని వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తారని అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఉపాధి విస్త రణ జరగడంతోపాటు మహిళలు ఆర్థికంగా పటి ష్టం అవుతారని అధికారులు చెబుతున్నారు.
రూ.10 లక్షల వరకు రుణాలు
రూ.3 లక్షల సబ్సిడీ
జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు 200 యూనిట్లు
ఇప్పటికే 60 యూనిట్ల ఏర్పాటు పూర్తి
రాయితీ రుణాలతో మహిళలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. మహిళలు రాయితీ రుణాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమలు, వ్యాపారాలను విస్తరించడానికి చొరవ తీసుకోవాలి. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందడమే మా లక్ష్యం.
– రాచయ్య, డీపీఎం, సెర్ప్


