అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ

Feb 27 2026 7:46 AM | Updated on Feb 27 2026 7:46 AM

అదనపు

అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు గురు వారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది ఐఏఎ స్‌లు బదిలీ అయ్యారు. జిల్లా అదనపు కలెక్ట ర్‌ (స్థానిక సంస్థలు) అంకిత్‌ను భద్రాది కొత్తగూడెం కలెక్టర్‌గా బదిలీ చేశారు. 2019 బ్యా చ్‌కు చెందిన అంకిత్‌ కొన్నేళ్లుగా జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

‘ద్వితీయం’లో

335 మంది గైర్హాజరు

ఖలీల్‌వాడి: ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 16,563 మంది విద్యార్థులకు గాను 16,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. 335 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రవికుమార్‌ తెలిపారు. జనరల్‌లో 14,465 మంది విద్యార్థులకు 14,184 మంది, ఒకేషనల్‌లో 2,098 మంది విద్యార్థులకు 2,044 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 58 పరీక్ష కేంద్రాలకు 54 కేంద్రాలను ఇంటర్‌ విద్యా కన్వీనర్‌తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హైపవర్‌ కమిటీ, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.

ఇంటికే సీతారాముల

కల్యాణ తలంబ్రాలు

టీజీఎస్‌ఆర్‌టీసీ రీజినల్‌ మేనేజర్‌ జ్యోత్స్న

సుభాష్‌నగర్‌: శ్రీరామనవమి పండుగ రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించేలా టీజీఎస్‌ఆర్‌టీసీ ఏర్పాట్లు చేసిందని రీజినల్‌ మేనేజర్‌ జ్యోత్స్న తెలిపారు. నగరంలోని ఆర్‌ఎం కార్యాలయంలో కల్యాణ తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను డిపో మేనేజర్లతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్యాణ తలంబ్రాలను టీజీఎస్‌ఆర్‌టీసీలాజిస్టిక్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని అన్ని ఆర్‌టీసీ కార్గో కౌంటర్ల వద్ద కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు.

కల్యాణ తలంబ్రాల కోసం

సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్లు

ఆర్మూర్‌ 73968 89496

బోధన్‌ 91542 98729

నిజామాబాద్‌–1 91542 98727

నిజామాబాద్‌–2 73968 89496

బాన్సువాడ 91542 98729

కామారెడ్డి 91542 98729

ఆర్‌ఎం ఆఫీస్‌ 86399 69647

రెండో రోజూ

జూడాల నిరసన

సుభాష్‌నగర్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు శాశ్వత క్రీడా మైదానం కేటాయించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (జూడా) ఆధ్వర్యంలో జూని యర్‌ డాక్టర్లు, విద్యార్థులు గురువారం రెండోరోజు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కొన సాగించారు. ఈ సందర్భంగా జూడాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కార్తీక్‌ మాట్లాడుతూ క్రీడా మైదానం లేకపోవడంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. సమస్యను ప్రభుత్వం, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గుర్తించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో జూడా ప్రధాన కార్యదర్శి జయంత్‌, జాయింట్‌ సెక్రెటరీ భావన, హేమంత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌  అంకిత్‌ బదిలీ
1
1/2

అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ

అదనపు కలెక్టర్‌  అంకిత్‌ బదిలీ
2
2/2

అదనపు కలెక్టర్‌ అంకిత్‌ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement