కాపీయింగ్‌కు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

కాపీయింగ్‌కు తావివ్వొద్దు

Feb 27 2026 7:46 AM | Updated on Feb 27 2026 7:46 AM

కాపీయింగ్‌కు తావివ్వొద్దు

కాపీయింగ్‌కు తావివ్వొద్దు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఇంటర్‌ పరీక్ష కేంద్రం తనిఖీ

బోధన్‌టౌన్‌(బోధన్‌): ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె గురువారం త నిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. ద్వితీయ సంవత్సరం మొదటి రో జు హాజరైన విద్యార్థుల సంఖ్య తెలుసుకున్నారు. కేంద్రంలో మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యా లు పరిశీలించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవా బు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు ఇతరులను అనుమతించొద్దని తెలిపారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement