క్రైం కార్నర్
లండన్‌లో జిల్లా వాసి మృతి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన యువకుడు లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన కామినేని సాయి శ్రీకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు కలిసి లండన్‌లో రూంలో ఉంటున్నారు. సాయిశ్రీకర్ లండన్‌లో ఎమ్మెస్ చదువుతున్నాడు. స్నేహితులతోనే ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి వారు ఉన్న రూములో ఏసీలో సాంకేతిక సమస్యలతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభిషేక్ మృతి చెందగా సాయి శ్రీకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. శ్రీకర్ తండ్రి ప్రసాద్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, తల్లి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం లండన్ వెళ్లిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఎంపీ అర్వింద్‌ను కలిసి కోరారు.
సిలిండర్ పేలి గాయపడ్డ వృద్ధురాలు..
వర్ని: మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో సిలిండర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వల్లూరి భూలక్ష్మి(63) అనే వృద్ధురాలు శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూలక్ష్మి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందింది. ప్రమాదంలో నివాసపు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని శ్రీనగర్ శివారులో శుక్రవారం రాత్రి డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై ఉన్న బిహార్‌కు చెందిన పరశురాం(35) శనివారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిడి అన్న బల్‌రాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
క్రైం కార్నర్


