పార్టీ పదవుల్లో బీసీలకు చెప్పినదానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలతో మరింతగా మమేకమ య్యే లక్ష్యంతోనే తాజాగా శిక్షణ తరగతులను అధినాయకత్వం నిర్వహించింది. ఆ మేరకు తక్షణమే ముందుకు వెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నాం. ఇక బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని చెప్పగా, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో 53 శాతం పదవులను పార్టీ కేటాయించింది. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చాము. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాతో ముందుకెళ్లనున్నాం. కీలకమైన పార్టీ పదవుల్లోనూ బీసీలకు 42 శాతానికి మించి ఇస్తాం తప్ప తక్కువ ఏమాత్రం ఇచ్చేది లేదు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా ఆయా నియోజకవర్గాల వారీగా కసరత్తులు చేస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం.


