నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో నూతనంగా చేరిన న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది తులసీదాస్ అందించిన న్యాయశాస్త్ర పుస్తకాలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మంగళవారం అందించారు. జూనియర్ న్యాయవాదులు ఈ పుస్తకాలను చదవాలని, సీనియర్ న్యాయవాదుల వాదనలు విని కోర్టు ప్రొసీడింగ్స్ అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పీపీ రాజేశ్వర్‌రెడ్డి, జీపీ ఆమిదాల సుదర్శన్, జగదీశ్వర్‌రావు, జే వెంకటేశ్వర్, పిట్లం శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, కార్యదర్శి ఝాన్సీరాణి, శ్రీమాన్, మద్దెపల్లి శంకర్, ఆశనారాయణ, ప్రభాకార్‌రెడ్డి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


