కరాటే, తైక్వాండో క్రీడలతో ఆత్మరక్షణ
నిజామాబాద్ అర్బన్: కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక ధృడత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలోని తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టోర్నమెంట్లను సద్వి ని యోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించే అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ రమేశ్ పవర్ మాట్లాడుతూ.. జిల్లాలో తైక్వాండో అభివృద్ధి కోసం మరిన్ని శిక్షణ శిబిరాలు, ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.


