పది విద్యార్థి.. జాగ్రత్త మరి.. | - | Sakshi
Sakshi News home page

పది విద్యార్థి.. జాగ్రత్త మరి..

Mar 7 2026 7:24 AM | Updated on Mar 7 2026 7:24 AM

ఖలీల్‌వాడి: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. పాఠశాలల్లో పున:శ్చరణ, రోజువారీ సాధన, డైలీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ఈనెల 14 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రతి నిమిషం కీలకమేనని, ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యారంగ, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.

● విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

● విద్యార్థులు రాత్రి 8 గంటలకే నిద్ర పోవాలని టీచర్లు సూచిస్తున్నారు.

● పరీక్షల వేళ విద్యార్థులను ఇంటి పనులకు దూరంగా ఉంచడం ఎంతోమేలు. ఫలితాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించాలి.

● విద్యార్థులకు పోషకాహారం అత్యంత కీలకమైంది. పరీక్షలకు సిద్ధం కావాలన్నా, రాయాలన్నా బలం అవసరం అవుతుంది. ఆకు కూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, మాంసాహారులైతే చేపలు, చికెన్‌ వంటివి తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలసటగా ఉంటే నిమ్మకాయను నీటిలో కలుపుకొని తాగాలి. పరీక్షలు అయ్యేంత వరకు బయట ఆహారం తీసుకోరాదు.

● విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ ఆకుల విశాల్‌ తెలిపారు.

ఈనెల 14 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

సన్నద్ధతకు ప్రతి నిమిషం కీలకం

ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి దూరం

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

కుటుంబ సభ్యులూ ప్రత్యేక దృష్టి పెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement