సాక్షి: ఉత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు
డీఈవో: విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు బోధిస్తున్నాం. టీచర్ల కొరత ఉన్న చోట గెస్ట్ టీచర్లను నియమించాం. సర్దుబాటు ద్వారా అవసరం ఉన్నచోట టీచర్లను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఇప్పటికే కరదీపికలను పంపిణీ చేపట్టి రివిజన్ చేస్తున్నాం. ఏ, బీ, సీ గ్రూపులుగా చదువులు కొనసాగిస్తున్నాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం.
● విద్యార్థులకు స్నాక్స్
● ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ అందించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షల కోసం విద్యార్థులను మానసికంగా దృఢంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
● కాపీయింగ్ నివారణకు
● ఎట్టి పరిస్థితిల్లో కాపీయింగ్ ఆస్కారం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. టీచర్లు ఎవరు విద్యార్థులను కాపీయింగ్‌కు ప్రోత్సహించవద్దు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం.
● ఈసారి ఎన్నో స్థానం
● గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 96.62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 16వ స్థానం వచ్చింది. ఈసారి జరిగే పరీక్షల్లో వంద శాతం విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానం లోపల ఉండాలని ప్రయత్నిస్తున్నాం.
● పరీక్షలకు విద్యార్థుల హాజరు
● పదో తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 24,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
● పరీక్షల నిర్వహణకు
తీసుకుంటున్న చర్యలు
● పరీక్షల నిర్వహణ కోసం 144 మంది చొప్పున సీఎస్, డీవోలను, 27 మంది కస్టోడియన్లను, నలుగురు అడిషనల్ డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, బెంచీలు ఏర్పాటు చేశాం.
విద్యార్థులకు మీరిచ్చే సలహాలు
పరీక్షలకు వారం రోజుల వరకు సమయం ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. మాస్ కాపీయింగ్‌పై ఆధారపడొద్దు. సెల్‌ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాను వినియోగించవద్దు. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏవైన సందేహాలు ఉంటే టీచర్లను, ఎంఈవో కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించి, రాష్ట్రంలో టాప్ ‘5’లో నిలుస్తామని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. ఇందుకోసం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. కొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను డీఈవో వివరించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఆలస్యంగా వెళ్తే ఐదు నిమిషాలు వెసలుబాటు కల్పించినట్లు చెప్పారు.
– ఖలీల్‌వాడి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే
క్రిమినల్ కేసులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో
అశోక్ కుమార్


