● సర్పంచుల ఫోరం జిల్లా
అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి
సీతక్కకు వినతి
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను రూ.15వేలకు పెంచాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి (ముస్కు) సాయిరెడ్డి కోరారు. ఈమేరకు జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సాయిరెడ్డి మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను జీపీ నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసిందని, చిన్న గ్రామ పంచాయతీలకు వేతనాలు భారంగా మారుతున్నాయని వివరించారు. వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సెపరేట్‌గా నిధులు జమ చేయాలని విజ్ఞప్తిచేశారు. జీపీల ద్వారా వసూలు చేస్తున్న పన్నులు, ఫీజులు వంటి నిధులు జీపీ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలకు విడుదల అయ్యేలా చూడాలని కోరారు. పెండింగ్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, సానిటేషన్ పనుల ఖర్చులు జీపీలకు భారమయ్యాయన్నారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, బోర్గాం శ్రీనివాస్, సర్పంచులు పాల్గొన్నారు.


