ఐదు నిమిషాల్లో ఎకరం.. | - | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాల్లో ఎకరం..

Mar 1 2026 7:27 AM | Updated on Mar 1 2026 7:27 AM

ఐదు న

ఐదు నిమిషాల్లో ఎకరం..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ దూసుకుపోతోంది. తమ శ్రమను తగ్గించిన పనిని వేగంగాపూర్తి చేసే ఆధునిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. నాట్ల నుంచి మొదలుకొని మందులు చల్లడం, పంట కోత వరకు పూర్తిగా యంత్రాలే పని చేస్తున్నాయి. అందులో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎకరాన్ని చుట్టి వచ్చే డ్రోన్‌ల వినియోగం గ్రామీణా ప్రాంతాల్లో చాలా పెరిగింది. జిల్లాలో వివిధ కంపెనీలు, డ్రోన్ల నిర్వాహకులు రైతులకు పరిచయం చేసి అతి తక్కువ ధరకే డ్రోన్‌ సేవలను అందిస్తున్నారు. డొంకేశ్వర్‌ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల రైతులు డ్రోన్‌ల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలకు మందులను డ్రోన్‌లతోనే స్ప్రే చేయిస్తున్నారు. డ్రోన్‌ ద్వారా కచ్చితమైన పనితీరు కనిపిస్తోందని రైతులు అంటున్నారు.

డ్రోన్‌తో అన్నీ లాభాలే..

కూలీలతో చేతి పంపు ద్వారా ఎకరం పంటకు మందు పిచికారీ చేయిస్తే గంటకు పైగా సమయం పట్టడంతోపాటు వారికి రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోంది. మందుల వినియోగం సైతం ఎక్కువగా ఉంటుంది. స్ప్రే చేసిన వారి ఆరోగ్యంపై మందు ప్రభావం పడుతుంది. డ్రోన్‌ ద్వారా అయితే ఎకరానికి రూ.350 నుంచి 400 ఖర్చుతోనే 5 నుంచి 10నిమిషాల వ్యవధిలోనే స్ప్రే పూర్తి అవుతుంది. మందు వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు, కూలీలకు విష ప్రభావం ఉండదు.

వరికి మందు

స్ప్రే చేస్తున్న డ్రోన్‌

సులభంగా, వేగంగా పంటలకు

మందుల స్ప్రే

వ్యవసాయంలో పెరిగిన

డ్రోన్ల వినియోగం

యాంత్రీకరణను సద్వినియోగం

చేసుకుంటున్న గ్రామీణ రైతులు

శ్రమ తగ్గింది

డ్రోన్‌లు అందుబాటులోకి రావడంతో రైతులకు శ్రమ తగ్గింది. చాలా సులభంగా మందులు స్ప్రే చేయిస్తున్నాం. నేను వినియోగించి మంచి ఫలితాలు పొందాను. దీంతో మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు కూడా డ్రోన్‌ వాడితే కలిగే లాభాలను వివరిస్తున్నా. – జైడి రాధాకృష్ణారెడ్డి, యువరైతు, నికాల్‌పూర్‌

రైతుల్లో అవగాహన పెరిగింది

వ్యవసాయ రంగంలో యంత్రాల పాత్ర కీలకంగా మా రింది. ప్రధానంగా కష్టం, ఖ ర్చు లేకుండా సమయాన్ని ఆదా చేసే డ్రోన్ల వి నియోగం గ్రామాల్లో చాలా పెరిగింది. రైతుల్లో అవగాహన కూడా కల్పిస్తున్నాం. తక్కువ ధరకే కిరాయి ఇస్తున్నాం.

– సతీశ్‌యాదవ్‌, డ్రోన్‌ నిర్వాహకుడు

ఐదు నిమిషాల్లో ఎకరం.. 1
1/3

ఐదు నిమిషాల్లో ఎకరం..

ఐదు నిమిషాల్లో ఎకరం.. 2
2/3

ఐదు నిమిషాల్లో ఎకరం..

ఐదు నిమిషాల్లో ఎకరం.. 3
3/3

ఐదు నిమిషాల్లో ఎకరం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement