ఎన్‌సీసీ ‘బీ’ సర్టిఫికెట్ పరీక్ష
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం ఎన్‌సీసీ బీ సర్టిఫికెట్ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 428 మందికి 418 మంది క్యాడెట్స్ పరీక్ష రాయగా 10 మంది గైర్హాజరైనట్లు ఎన్‌సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేశ్ సరియాల్, ఏవో లెఫ్టినెంట్ కల్నల్ రోహిత్ పూరి తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ కపూర్ మాట్లాడుతూ.. ఎన్‌సీసీ బీ సర్టిఫికెట్ పరీక్ష అర్హత సాధించిన క్యాడెట్లకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి, జాతీయత, వంటి భావాలతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఎన్‌సీసీ దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో సుబేదార్ అనూజ్ రానా, సుబేదార్ షెల్కే మహదేవ్, సుబేదార్ బల్వీందర్ సింగ్, హవల్దర్ సత్యేందర్ జిత్‌సింగ్, గుర్జిత్ సింగ్, ఎన్‌సీసీ ఆఫీసర్స్ కెప్టెన్ రాజేశ్వర్, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ నవీన్ కుమార్, సీటీవోలు, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, కృష్ణ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


