విద్యాకమిషన్‌ సిఫార్సులతో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం | - | Sakshi
Sakshi News home page

విద్యాకమిషన్‌ సిఫార్సులతో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం

Mar 6 2026 8:28 AM | Updated on Mar 6 2026 8:28 AM

ఖలీల్‌వాడి: విద్యాకమిషన్‌ ఆకునూరి మురళి సమర్పించిన సిఫార్సులతో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌రెడ్డి, కిషన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న పీఆర్టీ యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీచర్ల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, పర్మినెంట్‌ టీచర్లు వద్దని, పదోన్నతులు ఇవ్వొదని అనడం సరైంది కాదన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుంచి రెండు పబ్లిక్‌ పాఠశాలల స్థాపనతో మిగతా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లు మూతపడతాయని అన్నారు. ప్రాథమిక విద్యకు పూర్వ విద్యను మిళితం చేయడం, బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించడం మధ్యాహ్న భోజనాన్ని రెట్టింపు చేయడం అంశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు అంకం నరేశ్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ గోపిడి రవీందర్‌రెడ్డి, నాయకులు నరేశ్‌, అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement