సంపన్న వర్గాలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నవర్గాలకు అనుకూలంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అన్నారు. ఆదివారం నగరంలో సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరల్ని నియంత్రించడానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్,జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, పి.స్వర్ణ జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్, సుకన్య, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.


