పరీక్ష బాగా రాయలేదని విద్యార్థి..
లింగంపేట: పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దీపక్‌కుమార్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సంగెపు శివకుమార్(17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 26న ప్రారంభమైన తెలుగు పరీక్షను బాగా రాయలేదనే మనస్తాపంతో శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద గడ్డి మందు తాగి తన అక్కకు ఫోన్‌లో సమాచారం అందించాడు. వెంటనే కుటుంబీకులు అక్కడికి చేరుకొని శివకుమార్‌ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో వివాహిత..
రామారెడ్డి: వ్యక్తిగత కారణాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెడ్డు అనిత(22)కు తల్లితండ్రు లు ఎవరూ లేరు. వివాహమై హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.తాను ఉంటున్న ఇంట్లో వ్యక్తిగత కారణా లతో శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడింది. మృతురాలి మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆస్తి కోసం
అన్నను చంపిన తమ్ముడు
బిచ్కుంద: ఆస్తి కోసం అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన బిచ్కుందలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండ ల కేంద్రానికి చెందిన మెరుగు సాయిలు(50), నారాయణ అన్నాతమ్ముళ్లు. సాయిలు మండల శివారులో ఉన్న శివాలయంలో పూజారిగా పనిచేస్తు న్నాడు. కొన్ని రోజుల నుంచి వీరి మధ్య ఆస్తి గొడ వలు జరుగుతున్నాయి. శనివారం వేకువజామున ఆలయానికి వెళ్లిన సాయిలును నారాయణ రాయి తో తలపై కొట్టి హత్య చేశాడు. ఉదయం ఆలయం వద్ద మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు సాయిలును హత్య చేసింది నారాయణ అని గుర్తించారు. విచారణలో నారాయణ తన అన్నను ఆస్తి కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


