పసుపు పరిశ్రమ సందర్శన
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో జేఎంకేపీఎం పసుపు ఉత్పత్తిదారుల సంఘాన్ని గురువారం కేరళ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష సందర్శించారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పసుపు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. మున్ముందు స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు పరిశ్రమలకు వివిధ రకాలుగా సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పసుపు పరిశ్రమ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పైసెస్ బోర్డు అధికారులు రాజమాణిక్యం, రాణి, మాధవ్, ఎఫ్‌పీవో రొడ్డ రిత్విక్ తదితరులు పాల్గొన్నారు.


