అ‘పూర్వ’ సమ్మేళనం
రుద్రూర్/ వేల్పూర్: రుద్రూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1978–79 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులందరూ ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కట్ట శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు పీ రవికిరణ్, పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ హైస్కూల్‌కు చెందిన 2006–07 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను సన్మానించారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
అ‘పూర్వ’ సమ్మేళనం


