పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌ | - | Sakshi
Sakshi News home page

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

పీజీ

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌ న్యాయ విద్యార్థులు దేశానికి వెన్నెముకలా ఉండాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ రెగ్యులర్‌ మొదటి, 7వ సెమిస్టర్‌ పరీక్షల్లో శనివారం మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులు డిబార్‌కు గురైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ మెయిన్‌ క్యాంపస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల, భిక్కనూర్‌ సౌత్‌క్యాంపస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,905 మందికి 1,813 మంది హాజరు కాగా 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్మూర్‌లోని డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్‌ అయినట్లు చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ప్రిన్సిపాల్‌ జీ రాంబాబు సందర్శించి తనిఖీ చేశారు.

రోడ్డు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి

రుద్రూర్‌: మండలంలోని అక్బర్‌నగర్‌ శివారు లో వేసిన మొరం కుప్పల వల్ల రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయని శుక్రవారం రాత్రి స్థా నికులు ఆందోళన చేశారు. రోడ్డు పనుల నిమి త్తం మూల మలుపు వద్ద మొరం కుప్పలు వే యడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని నిరసన తెలిపారు. ప్రమాదంలో అ క్బర్‌నగర్‌కు చెందిన వ్యక్తికి తీవ్రగాయలయ్యాయని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఎ స్సై సాయన్న వెళ్లి వివరాలు సేకరించారు. చ ర్యలు తీసుకుంటామనే హామీతో స్థానికులు ఆందోళన విరమించారు.ఈ మేరకు శనివారం ఇద్దరి(టిప్పర్‌ డ్రైవర్‌, సైట్‌ ఇంజినీర్‌)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): న్యాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దేశానికి వెన్నెముకలా ఉండాలని, లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించిన పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్‌ జయప్రకాశ్‌ సూచించారు. తెయూ న్యాయ కళాశాల ఆధ్యర్యంలో ‘ప్రొఫెషనల్‌ లీగల్‌ టెక్నిక్స్‌ ఫ్రం ట్రయల్‌ కోర్ట్స్‌ టు కాన్‌స్టిట్యూషనల్‌ కోర్ట్స్‌’ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో జయప్రకాశ్‌ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. మారుతున్న కాలంలో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే న్యాయానికి విలువ ఉంటుందని ఆయన వివరించారు. వర్క్‌షాప్‌ కన్వీనర్‌గా జెట్లింగ్‌ ఎల్లోసా, కో–కన్వీనర్లుగా ప్రసన్న రాణి, బీ స్రవంతి వ్యవహరించారు. లా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌ 1
1/2

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌ 2
2/2

పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement