నిరంతరం నిఘా..
మోర్తాడ్: మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వివాదం ఇంకా తొలగిపోలేదు. ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా మోర్తాడ్‌లోని యువజన సంఘాల సభ్యులు మోర్తాడ్‌లోని సెంట్రల్ లైటింగ్ డివైడర్‌పై శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కానీ పోలీసులు వేరే చోట ప్రతిష్ఠించా లని యువజ సంఘాలకు చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో నాటి నుంచి వివాదం కొనసాగుతోంది. శివాజీ విగ్రహం ఎదుట పోలీసులు పెట్రోలింగ్ వాహనాన్ని అడ్డుగా ఉంచుతున్నారు. శాంతియుతంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తే ఒకరిద్దరు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బాన్సువాడ : రక్తం ఇచ్చి ప్రతీ హృదయం..మరో ప్రాణానికి కొత్త ఉదయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నురుకాపు సంఘంలో లయన్స్ క్లబ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. 108 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క చుక్క రక్తం ఎవరో ఒకరి జీవితంలో ఆశగా మారుతుందని, ఒక కుటుంబానికి చిరునవ్వును పంచుతుందన్నారు. సర్పంచ్ ధర్మతేజ, నాయకులు పోగు పాండు, ఎస్సై మహేందర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సంతోష్, వెంకటేశ్వర్‌రావు, రవీందర్ జెట్టి, కిశోర్, కార్తీక్, గాలయ్య తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజలు వారి ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్ ఆదివారం కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజలు ఇంటి, కుళాయి పన్నులు, వ్యాపారులు లైసెన్స్ ఫీజులు ఈనెల 31లోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
నిరంతరం నిఘా..


