మోపాల్(నిజామాబాద్‌రూరల్): దర్తీ అభజాన్ జా తీయ గ్రామీణ ఉత్కర్షఅభియాన్ (డీఏజేజీయూఏ) ద్వారా గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫా ర్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపుతున్న ట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు తెలిపారు. మండలంలోని అమ్రాబాద్ గ్రామంలో సో మవారం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్, ఎల్‌టీ లైన్‌లతోపాటు 13 గిరిజన కుటుంబాలకు విద్యుత్ మీటర్లను సర్పంచ్ ప్రియాంక ప్రేమ్‌సింగ్‌తో కలిసి ఎస్ ఈ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మా ట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సౌకర్యం లేని ప్రతి గిరిజన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీఏజేజీయూఏ ప థకాన్ని ప్రవేశపెట్టాయని పేర్కొన్నారు. ఈపథకంలో భాగంగా జిల్లాలో రూ.80 లక్షల వ్యయంతో 80 మంది గిరిజనుల ఇళ్లకు, 380 అంగన్‌వాడీ కేంద్రా లకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో డీఈ (కన్‌స్ట్రక్షన్) వెంకట రమణ, ఏడీఈలు తోట రాజశేఖర్, బాలేశ్ కుమార్, ఏఈ (కన్‌స్ట్రక్షన్) కాశీనాథ్, ఉపసర్పంచ్ ఏ ప్రకాశ్, విద్యుత్ సిబ్బంది జహీర్‌ఖాన్, మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బోధన్‌రూరల్: సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెట్టు పైనుంచి పడి గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సిరిగిరి నాగ్ గొండ (48) ఆదివారం గ్రామంలోని చింత చెట్టు చింతకాయలు తెంపుతుండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్ర గాయాల పాయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


