సుభాష్‌నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీమ్‌ను యాక్సిడెంట్ బాధితులు వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో గల ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం పీఎం రాహత్ స్కీమ్‌పై ఆరోగ్య శ్రీ మిత్రలు, ఆపరేటర్లకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీమ్‌లో భాగంగా యాక్సిడెంట్ జరిగిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50లక్షల వరకు లేదా, ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆరోగ్యమిత్రల సహకారం ఉండాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా బాధితులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. ఈదార్ మేనేజర్ వర్షాని హందు మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభం కానుందని తెలిపారు. పోలీస్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. వర్క్‌షాప్‌లో జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి మధు, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్‌రెడ్డి, సూపరింటెండెంట్ భాస్కర్, ఆరోగ్యశ్రీ మిత్రలు, ఆపరేటర్లు పాల్గొన్నారు.


