వైద్యులపై దాడులు సరి కాదు | - | Sakshi
Sakshi News home page

వైద్యులపై దాడులు సరి కాదు

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

వైద్యులపై దాడులు సరి కాదు

వైద్యులపై దాడులు సరి కాదు

ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు విశాల్‌ ఆకుల

సుభాష్‌నగర్‌: వైద్యులపై దాడులను నాన్‌ బెయిలబుల్‌ నేరాలుగా ప్రకటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ విశాల్‌ ఆకుల డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వైద్యుల సంఘం పిలుపు మేరకు వైద్యులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ధర్నాచౌక్‌లో శాంతియుతంగా నిరసన చేపట్టారు. వైద్యులు తమ సేవల సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ విశాల్‌ ఆకుల, డాక్టర్‌ హరీశ్‌ స్వామి మాట్లాడుతూ.. వైద్యులు, వైద్యసిబ్బందిపై భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. తెలంగాణ మెడికల్‌ సర్వీస్‌ పర్సన్‌, మెడికల్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో హింస నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యులను రక్షించడమంటే ఆరోగ్య వ్యవస్థను రక్షించడమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రమణేశ్వర్‌, కొట్టూరు శ్రీశైలం, అరవింద్‌రెడ్డి, శైలజ, విక్రమ్‌రెడ్డి, రాజేందర్‌ సూరినీడు, అయ్యప్ప చంద్రశేఖర్‌, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీహరి, వినోద్‌కుమార్‌ గుప్త, కౌలయ్య, నవీన్‌ మాలు, దీపు మాలు, పార్వతి దేవి, నాగమోహన్‌, వినయ్‌కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement