సూపర్ బ్రెయిన్ యోగాతో జ్ఞాపకశక్తి మెరుగు
డిచ్‌పల్లి: సూపర్ బ్రెయిన్ యోగా(గుంజీళ్లు) ఆచరించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుంజీళ్ల మాస్టారు అందె జీవన్‌రావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో జరుగుతున్న ‘యోగా శాస్త్ర సంగమం–2026’, 9వ అంతర్జాతీయ యోగా ఫిలాసఫీ సదస్సులో జిల్లా నుంచి అందె జీవన్‌రావు పాల్గొన్నారు. ‘సూపర్ బ్రెయిన్ యోగా–పతంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యం’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా, పతంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యతలు ఉన్నాయని, వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పతంజలి యోగా సూత్రాలోని ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన వంటి అంశాలు సూపర్ బ్రెయిన్ యోగా తో పోలి ఉన్నాయని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను 14 రౌండ్లు ఆచరించడం ద్వారా ధ్యాన శక్తిని పొందుతామని అందె జీవన్ రావు వివరించారు.


