● ఎగిసి పడిన మంటలు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఓ శానిటేషన్ కార్మికుడు కలెక్టరేట్ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ వద్ద జనరేటర్ స మీపంలో చెత్త కుప్పకు నిప్పు పెట్టాడు. అది కాస్త గాలికి పక్కనే ఉన్న ముళ్లపొదలు, చెత్తకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. జనరేటర్ నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వెనుక వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. టాయిలెట్ గదుల వెంబడి ఉన్న ఎండిపోయిన చెట్ల పొదలకు మంటలు అంటున్నా యి. ట్రాన్స్‌పార్మర్ వైర్లు కాలిపోయాయి. సమీపంలోనే వివిధ శాఖలకు సంబంధించిన కార్లు పార్కింగ్ చేసి ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది కార్లను అక్కడి నుంచి తీసివేయించారు. గంటన్నర పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో కలెక్టరేట్‌లో జరుగుతున్న సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఉండడంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.


