యూరియా యాప్‌లో మార్పులు
ఏ మండల రైతులు అదే మండలంలో కొనేలా సదుపాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బుకింగ్ యాప్‌లో వ్యవసాయ శాఖ మార్పులు చేసింది. మొన్నటి వరకు జిల్లా యూనిట్‌గా ఉన్న విధానాన్ని తొలగించి మండలం యూనిట్‌గా చేసింది. దీంతో ఏ మండలానికి చెందిన రైతులు అదే మండలంలోని సొసైటీలు, ప్రయివేటు డీలర్ల వద్ద కొనుగోలు చేసే సదుపాయం ఏర్పడింది. ఈ మార్పును ఈ నెల 25 నుంచి అమల్లోకి తె చ్చారు. జిల్లా యూనిట్ విధానంతో ఇది వరకు రైతులు వేరే మండలాలను ఎంపిక చేసుకొని యూరియాను కొనుగోలు చేశారు. దీంతో ని ల్వలు లేక స్థానిక రైతులు యూరియా బుకింగ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పక్క మండలా లు, గ్రామాల రైతులు వచ్చి తమ యూరి యాను కొనుగోలు చేసి తీసుకెళ్లడంపై జిల్లాలో పలు చోట్ల రైతులు ఆందోళన చేశారు. తలెత్తిన ఈ సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా వ్య వసాయాధికారి వీరాస్వామి రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండలం యూనిట్‌గా యాప్‌లో మార్పులు చేస్తే బాగుటుందనే ఆలోచనతో యాప్‌లో మార్పులు చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఒక మండల రైతులు మరో మండలంలో కొనుగోలు చేయడం లేదు. స్థానిక రైతుల డిమాండ్‌ను బట్టి వ్యవసాయాధికారులు, సొసైటీలు, డీలర్లు యూరియా బస్తాలను తెప్పించి ఇస్తున్నారు.
18 రోజుల్లో 2.10 లక్షల బస్తాలు సేల్
యూరియా బుకింగ్ యాప్ వచ్చి 18 రోజులు అవుతోంది. జిల్లాలో ఏకంగా 2.10 లక్షల బస్తా ల (9,500 మెట్రిక్ టన్నులు) యూరియాను 70 వేల మంది రైతులు కొనుగోలు చేశారు. అ తి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో యూరియా సేల్ కావడంతో వ్యవసాయాధి కారులు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటికే 77 వేల మెట్రి క్ టన్నుల యూరియా అమ్ముడైంది.
యూరియా యాప్‌లో మార్పులు


