నిజామాబాద్‌అర్బన్: ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించనున్నారు. ఐదు దశల్లో 99 రోజులపాటు వివి ధ శాఖలకు సంబంధించి పది ముఖ్యమైన అంశాల వారీగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దీనిని ప్రణాళిక శాఖ పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రత్యే క యాప్‌ను రూపొందించారు. మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్ర ణాళిక’ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి ప్రభుత్వ సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై సీఎం దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
ఈనెల 6వ తేదీన గ్రామస్థాయిలో గ్రామస భల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గస్థాయిలో, 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామస్థా యి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం పది అంశాలతో 99 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఐదు దశల్లో 99 రోజులపాటు
కార్యక్రమాలు
పర్యవేక్షించనున్న ప్రణాళిక శాఖ
మొదటిరోజు ఉమ్మడి జిల్లా
సన్నాహక సమావేశం


