మాదిగ అమరవీరుల స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ
నిజామాబాద్ రూరల్: మాదిగ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ చౌరస్తా లో మాదిగ అమర వీరులకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ మాదిగ అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ అమర వీరుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి పాదాలు కడిగి రూ. ఐదు లక్షలు అందజేసి, వారి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు.ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ, మాదిగ మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు బంటు జ్యోతి ,మాదిగ ఉద్యోగస్తుల సంఘం మైసయ్య , రాములు,రమేశ్, నాయకులు తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు


