స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలి

Mar 5 2026 7:18 AM | Updated on Mar 5 2026 7:18 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విజయవంతానికి కృషి చేయాలని, ఐదు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. ఐదు దశల్లో చేపట్టనున్న 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు.

ఈనెల 6న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌, డీఆర్డీవో సాయాగౌడ్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

విజయవంతానికి కృషి చేయండి

6న ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన

ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం

సమీక్షా సమావేశంలో అధికారులతో

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement