విద్యార్హతలతోపాటు నైపుణ్యాలు అవసరం | - | Sakshi
Sakshi News home page

విద్యార్హతలతోపాటు నైపుణ్యాలు అవసరం

Mar 6 2026 8:05 AM | Updated on Mar 6 2026 8:05 AM

విద్యార్హతలతోపాటు నైపుణ్యాలు అవసరం 8 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తాళం వేసిన ఇంట్లో చోరీ

తెయూ(డిచ్‌పల్లి): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం విద్యార్హతలే కాకుండా సాఫ్ట్‌ స్కిల్స్‌ ఎంతో అవసరమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రా ర్‌ యాదగిరి అన్నారు. తెయూలో గురువారం యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ సెల్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘కనెక్ట్‌ విత్‌ వర్క్‌: ఎంప్లాయిబిలిటీ అండ్‌ లైఫ్‌ స్కిల్స్‌’ పై వారం రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ట్రైనింగ్‌ ఆఫీసర్లు పవన్‌రెడ్డి, అంజలి, రోహిణి పటేల్‌ వివిధ నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ పాతనాగరాజు, ప్రిన్సిపాల్‌ రాంబాబు, అంజనేయులు, వాసం చంద్రశేఖర్‌, నాగరాజు, శ్రీనివాస్‌, కిరణ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: భారతీయ వాయు సేన నందు అగ్నివీర్‌ వాయు ఉద్యోగాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యువతీయువకులకు ఈనెల 8 నుంచి 18 వరకు ఓపెన్‌ రిక్రూట్మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకుబ్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోగల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17 నుంచి 21 సంవత్సరాలలోపు వారు, పెళ్లికాని పురుషులు, మహిళలు అర్హులన్నారు.

ధర్పల్లి: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లి కొత్త బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్న మంచి కంటి రామచందర్‌ ఇంటికి కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి కొంత నగదుతో పాటు, ఒక తులం బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాస్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement