గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న వీఆర్ కాంప్లెక్స్ సెల్లార్‌లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 35ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధ్యావల్ల రాములు (26) హోలీ పండుగ రోజున మద్యం తాగి భార్యతో గొడవపడి కొట్టాడు. మరుసటి రోజు సైతం భార్యను కొట్టడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాములు గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కుమారుడిని చంపిన తండ్రి రిమాండ్
ఇందల్వాయి: కుమారుడిని చంపిన తండ్రిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ వినోద్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు భాను ప్రకాశ్ గంజాయికి అలవాటు పడి తల్లితండ్రులను వేధించేవాడు. కొడుకు వేధింపులు భరించలేక కిషన్ తన కుమారుడు భానుప్రకాశ్‌ను గురువారం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుమారుడి వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీఐ పేర్కొన్నారు.


