దవాఖానా నిర్వహణ ఎలా? | - | Sakshi
Sakshi News home page

దవాఖానా నిర్వహణ ఎలా?

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

సామాజిక ఆస్పత్రులకు

విడుదల కాని నిధులు

రెండేళ్లుగా నిలిచిపోయిన వైనం

మోర్తాడ్‌(బాల్కొండ): వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని సామాజిక ఆస్పత్రుల(కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌)కు నిధులు విడుదల కాకపోవడంతో నిర్వ హణ భారమవుతోంది. జిల్లాలో మోర్తాడ్‌, బాల్కొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, నవీపేట్‌, వర్నిలో 30 పడకల, ఆర్మూర్‌, బోధన్‌లో వంద పడకల ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. భీమ్‌గల్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ దశలోనే ఉంది. ఒక్కో ఆస్పత్రికి ప్రతి ఏటా రూ.2.50 లక్షల చొప్పున నిధులు కేటాయించేవా రు. రెండేళ్లుగా నిధులు విడుదల కావడంలేదు. ఆస్పత్రికి గతంలో సలహా కమిటీలు కొనసాగాయి. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ని ధులను వినియోగించేవారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కా లం ముగిసిపోవడంతో సలహా కమిటీలు నామమా త్రమయ్యాయి. ఎమ్మెల్యేలు సలహా కమిటీకి బాధ్య త వహించాల్సి ఉంది. నిధులు విడుదల చేయకపోవడంతో కమిటీల పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.

నిధుల కోసం విన్నవించాం

ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తేనే నిర్వహణకు ఇబ్బంది ఉండదు. నిధుల మంజూరు కోసం విన్నవించాం. త్వరలోనే విడుదల కావొచ్చు.

– డాక్టర్‌ వివేక్‌, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement