పెద్దపులి అలజడి | - | Sakshi
Sakshi News home page

పెద్దపులి అలజడి

Mar 5 2026 7:18 AM | Updated on Mar 5 2026 7:18 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

విద్యార్థుల మధ్య ఘర్షణ

హోలీ సంబరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌క్యాంపస్‌ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీశాయి.

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఊహించిన విధంగానే జిల్లాలోకి పెద్ద పులి రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చే అవకాశాలున్నట్లు అటవీ అధికారులు గత పది రోజులుగా భావిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే పెద్ద పులి జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి రేంజ్‌ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇందులో భాగంగా పులి అడుగులను గుర్తించారు. పాదముద్రల కొలతలను సేకరించారు. అయితే ఈ పులి ఎటు వెళ్లిందనే విషయమై అధికారులు ఒక అంచనాకు రాలేదు.

కమ్మర్‌పల్లి రేంజ్‌ అధికారి రవీందర్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కలిగిన మూడు బృందాలు బుధవారం ఆయా అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న కమ్మర్‌పల్లి రేంజ్‌లోని కోనాపూర్‌ సెక్షన్‌లోని ఇనాయత్‌నగర్‌ బీట్‌ పరిధిలో గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించారు. అయితే తాజాగా బుధ వారం పెట్రోలింగ్‌ చేసిన అటవీ సిబ్బందికి సమీప అడవుల్లో మరోచోట పెద్ద పులి పాద ముద్ర కనిపించింది. దీంతో పెద్దపులి కిలోమీటరు పరిధిలోనే ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. కాగా పక్కనే సరిహద్దుల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా మానాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు మరింత అలర్ట్‌ అయ్యారు.

● పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అటవీ శాఖ అధికారులు గట్టుపొడిచినవాగు సమీపంలో పలు చోట్ల ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి దాహం తీర్చుకునేందుకు నీటి కుంటల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో దాని కదలికలు గుర్తించేందుకు అవకాశాలు ఉన్నాయి. ట్రాప్‌ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు రికార్డు అయితే కమ్మర్‌పల్లి రేంజ్‌లోనే సంచరిస్తున్నట్లుగా అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఒకవేళ రికార్డు కాకపోతే మాత్రం అది వేరే చోటికి వెళ్లినట్లుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. జిల్లాలోని ఆయా రేంజ్‌ల పరిధిలోని గ్రామాల ప్రజలకు పెద్దపులి సంచారంపై హెచ్చరికలు జారీ చేశారు.

జత కోసం..

జత కోసం వెదుకుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత కొన్ని వారాలుగా తిరుగుతున్న పులి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు వారాల క్రితమే భావించిన అధికారులు తగినవిధంగా అప్రమత్తమయ్యారు. పది రోజుల కిందటే కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి అదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని జన్నారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి, తిరిగి మళ్లీ సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా మీదుగా జగిత్యాల జిల్లాలోకి పులి ప్రవేశించింది. వేములవాడ ప్రాంతంలో ఒక ఆవును చంపేసింది. అయితే తాజాగా గుర్తించిన పులి పాదముద్రలను బట్టి ఇది 300 కిలోలకు పైగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

మేకల మందపై

చిరుత దాడి

వర్ని: మండలంలోని కూనిపూర్‌ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకువెళ్లగా చిరుత మందపై దాడి చేసి ఓ మేకను చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుతల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని వర్ని అటవీ రేంజ్‌ అధికారి గంగారాం సూచించారు.

369 మంది

విద్యార్థుల గైర్హాజరు

ఖలీల్‌వాడి : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్ర శాంత వాతావరణంలో కొనసాగుతున్నా యి. బుధవారం నిర్వహించిన సెకండియర్‌ మ్యాథ్స్‌–2 ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. మొత్తం 16,899 మంది విద్యార్థులకు గాను 16,530 (97.8 శాతం) మంది హాజరుకాగా, 369 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 58 సెంటర్లలో ఎగ్జామ్స్‌ కొనసాగుతుండగా.. 54 సెంటర్లను తనిఖీ చేశామన్నారు.

పుష్కరాల వేళ

పటిష్ట బందోబస్తు

రెంజల్‌(బోధన్‌): గోదావరి పుష్కరాలకు (2027 జూన్‌ – జూలై)పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేస్తామని సీపీ సాయి చైతన్య అన్నా రు. కందకుర్తి పుష్కర క్షేత్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. 2015 పుష్కరాల నిర్వహణ, లోటుపాట్ల వివరాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భక్తు లు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా రూట్‌మ్యాప్‌ను రూపొందించాలని బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌కు సూచించారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్లను పరిశీలించిన సీపీ.. పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్‌ గయాసుద్దీన్‌కు సూచించారు. సీపీ వెంట బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్‌ ఉన్నారు.

ఇనాయత్‌నగర్‌ అడవిలో పెద్దపులి పాదముద్రల కోసం

గాలిస్తున్న అటవీ సిబ్బంది

ఇనాయత్‌నగర్‌ అటవీ

ప్రాంతంలో అధికారులు

గుర్తించిన పులి పాదముద్ర

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కోనాపూర్‌, ఇనాయత్‌నగర్‌, కొత్త చెరువు తండా, మానాల, నర్సాపూర్‌ గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ క్షేత్ర అధికారి రవీందర్‌ హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూదన్నారు. రైతులు పంట చుట్టూ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లు అడవిలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

కమ్మర్‌పల్లి: పెద్దపులి అడుగుల గుర్తింపు కోసం అటవీ అధికారులు కాలినడకన గా లింపు చర్యలు చేపట్టారు. కమ్మర్‌పల్లి రేంజ్‌ అధికారు లు గట్టు పొడిచిన వాగు ప్రా జెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ఏరియా కాంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 14 లో తిరిగారు. మెట్‌పల్లి రేంజ్‌, సిరిసిల్ల జిల్లా మ ల్యాల, చందుర్తి రేంజ్‌ల అటవీ అధికారులు కో నాపూర్‌ రాళ్లవాగు ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రదేశం కాంపార్ట్‌మెంట్‌ 24లో గాలించారు. కమ్మ ర్‌పల్లి రేంజ్‌ ఇనాయత్‌నగర్‌ పరిధిలోని కాంపార్ట్‌మెంట్‌ 14లో పెద్దపులి వంద మీటర్ల వరకు సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. పెద్ద పులి సంచరించిన చోట ఒక్కో అడుగు 17 నుంచి 19 సెంటీమీటర్లు ఉన్నట్లు కమ్మర్‌పల్లి అట వీ క్షేత్ర పరిధి అధికారి రవీందర్‌ తెలిపా రు. అడుగులను బట్టి మగపులిగా గుర్తించామన్నారు. జగిత్యాల, సిరిసిల్ల సరిహద్దుల్లో సంచరించి జిల్లాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి

రేంజ్‌లలో టెన్షన్‌

పులి రాక నిర్ధారణ.. ఎటు వెళ్లిందో

అంచనాకు రాలేకపోతున్న అధికారులు

ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్‌

నిర్వహిస్తున్న అటవీశాఖ

క్రమంగా అడుగంటుతున్న

భూగర్భ జలాలు

రెండు నెలల్లో 3.36 మీటర్లు

తగ్గిన వైనం

జిల్లాలో ప్రస్తుత నీటి మట్టం 11 మీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement