మట్టి స్నానం ఆరోగ్యకరం.. ఉల్లాసభరితం
బోధన్: ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మట్టి స్నానం చేయడం ఆరోగ్యకరమని, మనస్సు ఉల్లాసభరితంగా ఉంటుందని జిల్లా కేంద్రానికి చెందిన యోగాచార్యులు ఎక్కొండా ప్రభాకర్, జిలకర కిషన్ అన్నారు. ఇరువురు యోగాచార్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులో ఉన్న అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. మట్టిస్నానం ఆచరించడం వల్ల చర్మ వ్యాధితో పాటు ఇతర రోగాల నివారణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా యోగసాధనకులు తరలి వచ్చి మట్టి స్నానం చేశారు.
రుద్రూర్: మండల కేంద్రంలోని మహర్షి పతాంజలి యజ్ఞ సహిత యోగా – ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మట్టిస్నాన కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగకు ముందు ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోటగిరి, బోధన్, పొతంగల్, రెంజల్ మండలాలతో పాటు వివిధ యోగా కేంద్రాల నుంచి మొత్తం 52 మంది యోగాసాధకులు పాల్గొని మట్టి స్నానం చేశారు. రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ మహజన్, యోగా సమితి సభ్యులు కాసుల శ్రీనివాస్, బెజగం వెంకటేశం, విజయ్, తోట్ల గంగారాం, సాయిబాబా, యోగా శివ, రామరాజు, ప్రసాద్, శ్రీనివాస్, పురుషోత్తం, సాయిలు, అంబం రాములు, తొర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి స్నానం ఆరోగ్యకరం.. ఉల్లాసభరితం


