కాంగ్రెస్‌కు కుల, మత భేదాల్లేవ్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కుల, మత భేదాల్లేవ్‌

Mar 5 2026 7:18 AM | Updated on Mar 5 2026 7:18 AM

సుభాష్‌నగర్‌: కాంగ్రెస్‌కు కుల, మత భేదాల్లేవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీకి మూల స్తంభాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో కార్పొరేషన్‌ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 21 నుంచి పది రోజుల పాటు వికారాబాద్‌లో జరిగిన సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ డీసీసీ అధ్యక్షుల శిక్షణ అనుభవాలను మీడియాతో నగేష్‌రెడ్డి పంచుకున్నారు. అంటరాని తనం, ప్రజల్లో అంతరాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని, గరీబీ హఠావో ఇందిరాగాంధీ నినాదమని గుర్తు చేశారు. కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారన్నారు. మేధావులు, యువకులు, విద్యార్థులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ దొంగ నిరాహార దీక్ష చేశారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.64 వేల కోట్లు ఉంటే, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే ప్రాజెక్టులు కట్టారని, రోడ్లు వేశామని, పేదలకు ఇండ్లు, పింఛన్లు, ఎయిర్‌ పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ట్రిపు ల్‌ ఐటీలు, ఆస్పత్రులు నిర్మించారన్నారు. సీ ఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమా ర్‌గౌడ్‌ సారథ్యంలో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

పనిచేసే వారికే ప్రాధాన్యత..

కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో ఏఐసీసీ నా యకులు, రాష్ట్ర మంత్రులు, మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మేధావు లు, ప్రొఫెసర్లు వివిధ అంశాలపై శిక్షణనిచ్చారని తెలిపారు. ఏఐసీసీ నాయకులు, మంత్రులు పార్టీని బలోపే తం చేయడంపై దిశానిర్దేశం చేశారన్నారు. పార్టీ జిల్లా, మండల, బూత్‌ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఆర్గనైజేషన్‌ విషయంలో ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించిందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ సర్టిఫికెట్‌తోపాటు చరఖాను ప్రదానం చేశారని, రాహుల్‌ గాంధీ నా లుగు గంటలపాటు ఆత్మీయంగా కుటుంబ సభ్యులందరితో ఫొటో సెషన్‌కు అవకాశమివ్వ డం మరుపురాని సంఘటన అని, ఆయనకు రుణప డి ఉంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతరెడ్డి రాజరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, సీని యర్‌ నాయకులు జావిద్‌ అక్రమ్‌, నరాల రత్నాకర్‌, ఘన్‌రాజ్‌, విఫుల్‌ గౌడ్‌, గడీల రాములు, వైశాక్షి సంతోష్‌, రాజా నరేందర్‌ గౌడ్‌, కెతావత్‌ యాదగిరి, సు భాష్‌ జాదవ్‌, మల్యాల గోవర్ధన్‌ పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి తీరుతాం..

ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేశారని, ఈ అవకాశాన్ని ప్రజలు, పార్టీ కోసం పని చేసి సద్వినియోగం చేసుకోవాలని రాహుల్‌గాంధీ చెప్పారని నగేష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ గులాంగిరి చేయొద్దని, పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు మాత్రమే గులాంగిరి చేయాలని సూచించారన్నారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి తీరుతామన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు

మూలస్తంభాలు

అందరి సమన్వయంతో పార్టీని

మరింత బలోపేతం చేస్తాం

డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement