ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్
గోనె లహరి
● అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరిస్తామని ము న్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి పేర్కొన్నారు. ము న్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డితోపాటు కౌన్సిలర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్మన్ పదవి ప్రజల కు సేవ చేసే అద్భుతమైన అవకాశమన్నారు. ప రిశుభ్రత, నీటి సరఫరా, రోడ్డు , డ్రెయినేజీ కనీస సౌకర్యాల విషయంలో రాజీపడకుండా పనిచేస్తామన్నారు. పారదర్శక పాలన అందిస్తామని స్ప ష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్‌రావు, కౌన్సిలర్, సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మా ట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి పను లు జరుగుతున్నాయన్నారు. ఉర్దూ అకాడమీ చై ర్మన్ తాహెర్‌బిన్ హందాన్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్న, నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, తెలంగాణ కో–ఆపరేటివ్ యూని యన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


