వేరే దారి చూసుకోండి..! | - | Sakshi
Sakshi News home page

వేరే దారి చూసుకోండి..!

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

మోర్తాడ్‌(బాల్కొండ): గ్రామ పంచాయతీ మల్టీపర్పస్‌ వర్కర్లకు వేతనాల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జీపీలకు వచ్చే జనరల్‌ ఫండ్‌ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ డి దివ్య రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్‌కలెక్టర్లు, వాటర్‌మెన్‌లు, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 3054 మంది ఉండగా, వారందరికీ ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. ఇందుకోసం టీఎస్‌బీపాస్‌ను తీసుకువచ్చింది. గతేడాది నవంబర్‌ 2025 వరకు మల్టీపర్పస్‌ వర్కర్లకు వేతనాలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తమకు సంబంధం లేదనడంతో సర్పంచ్‌లు తలలుపట్టుకుంటున్నారు.

కేంద్రం నుంచి రాలేదు..

రాష్ట్రం ఇవ్వలేదు

వాస్తవానికి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రతినెలా కేంద్రం, రాష్ట్ర నుంచి రూ.10.30 కోట్ల చొప్పున రూ.20.60 కోట్లు విడుదల కావాలి. అయితే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన కాలానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పాలకవర్గాలు లేకపోవడమే దీనికి కారణం. ఎస్‌ఎఫ్‌సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి నెలా రూ.10.30 కోట్లు విడుదల చేయలేదు. టీఎస్‌బీపాస్‌ ద్వారా మల్టీపర్పస్‌ వర్కర్ల వేతనాల కోసం రూ.2,90,13,000 నిధులను విడుదల చేసింది. ఈ లెక్కన రూ.7,39,87,000 చొప్పున నిధుల జాడ లేకుండా పోయింది. పాలకవర్గాలు లేకపోవడంతో నిధుల అంశాన్ని లేవనెత్తేవారు కరువయ్యారు.

నిధుల విషయంలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రామ పంచాయతీలకు కొత్త సమస్య

ఆదాయం అంతంతే..

వేతనాలు చెల్లించేదెలా..

ప్రభుత్వ నిర్ణయం సరికాదు

పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. పంచాయతీలకు ఆదాయం ఎంతో తక్కువగా ఉంది. ప్రభుత్వం వేతనాలను చెల్లించి పంచాయతీలకు భారం తప్పించాలి. – పావని, సర్పంచ్‌, తొర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement