నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్‌లో ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రగతిశీల మహిళా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మీ, గొంట్యాల సంజన తెలిపారు.బుధవారం పోచమ్మగల్లిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు.మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని పిలుపునిచ్చారు.పీవోడబ్ల్యూ నాయకులు జమున రాధా నర్సు బాయి, కళావతి, పోచమ్మ గల్లీ కాలనీవాసులు పాల్గొన్నారు.
ధర్పల్లి: మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నాలెడ్జ్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే విధంగా వివిధ మోడల్స్ రూపంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రి న్సిపల్ అల్లాడి శ్రీకాంత్, డైరెక్టర్ ప్రశాంత్,
స్పందన ఉపాధ్యాయులు తదితరులున్నారు.
విద్యార్థులు సంస్కారాన్ని
పెంచుకోవాలి
నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని పెంచుకోవాలని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవులా అన్నారు. బుధవారం సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. పాఠశాల హెచ్‌ఎం పోశన్న, ఉపాధ్యాయులు లలిత, డాక్టర్ సత్యనారాయణ, గోపాల్, మొహమ్మద్ జావిద్, విద్యాసాగర్, గంగాధర్, ఘనపురం దేవేందర్, స్వరూప, లలిత, శ్రీలత, సుజాత, సునంద, కృష్ణంరాజు తదితరులున్నారు.


