నగరంలో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నగరంలో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూం ప్రారంభం

Mar 6 2026 8:05 AM | Updated on Mar 6 2026 8:05 AM

ముఖ్య అతిథులుగా హాజరైన సినీనటి

నిధి అగర్వాల్‌, నగర మేయర్‌ ఉమారాణి

భారీగా తరలివచ్చిన జనం

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని ఆర్‌పీ రోడ్డులో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటి నిధిఅగర్వాల్‌, నగర్‌ మేయర్‌ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేశారు. ఈసందర్భంగా నటి నిధి అగర్వాల్‌ మట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సరికొత్త షోరూ మ్‌ను ప్రారంభించడం ద్వారా ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుందన్నారు. సౌత్‌ ఇండియాలో కుటుంబ షాపింగ్‌ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకై క గమ్యంగా, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూంను నిజామాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో విజయకేతనం ఎగురవేస్తోందన్నారు. చైర్‌పర్సన్‌ హోల్‌ టైం–డైరెక్టర్‌ పొట్టి వెంకటేశ్వర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీర్ణ రాజమౌళి, హోల్‌ టైం డైరెక్టర్‌ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్లను సేకరించి జిల్లా కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. అలాగే ఒక సమగ్రమైన లైఫ్‌స్టైల్‌ విభాగాన్ని కూడా పరిచయం చేస్తోందన్నారు. కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువు ఒకేచోట దొరికే ఒక పరిపూర్ణమైన గమ్యస్థానం ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement