వృద్ధుడి ఆత్మహత్య
డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన మచ్చ బుచ్చయ్య(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా బుచ్చయ్య మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులకు తిరిగి వచ్చేవాడు. అలాగే శనివారం ఉదయం ఇంటి నుంచి నుంచి బయటకు వెళ్లిన అతను రాత్రయినా తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం చెరువులో బుచ్చయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా గతేడాది పెద్ద కుమారుడు చనిపోయాడు. చిన్న కుమారుడు ఇటీవలే బతుకుదెరువు కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లాడు. ప్రస్తుతం గల్ఫ్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల విమాన రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామానికి రాలేకపోతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రామారెడ్డి: వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేటకు చెందిన చాకలి శంకర్(42) కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య


