గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాల మూసివేత | - | Sakshi
Sakshi News home page

గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాల మూసివేత

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

నేడు శుద్ధి తరువాత తెరుచుకోనున్న ఆలయాలు

నిజామాబాద్‌ రూరల్‌: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. బుధవారం ఉదయం శుద్ధి అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. గ్రహణం మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 6.49 గంటల వరకు కొనసాగింది. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపం, ధ్యానం చేస్తూ దైవ చింతనలో గడిపారు. 6.49 గంటల తరువాత ఇళ్లను శుద్ధి చేసుకుని స్నానాల అనంతరం భోజనాలు చేశారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వ, శంభులిగేశ్వర, సారంగాపూర్‌ హనూమాన్‌ ఆయాలతోపాటు నామ్‌దేవాడ సాయిబాబా ఆలయం, సంతోషిమాత, వేంకటేశ్వర తదితర ఆలయాలన్నింటినీ మూసి ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement