ఖలీల్‌వాడి: మాండలికి వికాసమే భాషాభివృద్ధికి మూలం అని, మన భాషలోని తెలుగు భాషకు మూలాలు ఉన్నాయని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వికాసం వికృతి వైవిధ్యం అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష మూలాలు తెలంగాణ మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య మాట్లాడుతూ.. తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రామాణిక వ్యాసాలతో రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, సదస్సు కన్వీనర్ రామస్వామి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐకేసి కోఆర్డినేటర్ రాజేశ్, పీఆర్వో దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు.


