సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు.
..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్‌ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.



