పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి

Mar 23 2024 12:50 AM | Updated on Mar 23 2024 4:02 PM

- - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌

ఎంపీకి అహంకారం ఎక్కువ

మళ్లీ బాండ్‌ పేపర్‌ డ్రామా

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ

కాంగ్రెస్‌కు మూడోస్థానమే..

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్‌ చూపించాలని.. నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఎంపీకి అహంకారంతో ఉన్నారని.. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ పేరిట మరోసారి బాండ్‌ పేపర్‌ డ్రామా ఆడుతున్నారన్నారని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు అర్వింద్‌ను కచ్చితంగా ఓడిస్తారన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్నారు. పసుపుబోర్డు పేరుతో ఇప్పటికే ఎంపీ అర్వింద్‌ ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఎంపీ కాకముందే పసుపు క్వింటాలుకు రూ. 17వేలు ధర పలికిందన్నారు. పసుపు దిగుబడి తగ్గినందునే ధర పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో ఎంపీ అర్వింద్‌ అహంకారంతో నడుచుకున్నారని.. ఆయన ఓటమి ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ గెలవాలని కానీ.. అర్వింద్‌, బండి సంజయ్‌ లాంటి వాళ్లు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.

సీఎం రేవంత్‌ హామీలు అమలు చేయడం లేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తాను ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

ఇవి చదవండి: తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement