వీఏఓఏటీ కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏఓఏటీ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని శనివారం నగరంలోని పవర్‌హౌస్ కంపౌండ్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జే శివాజీ గణేశ్, కార్యదర్శిగా పీ వెంకట్, ఉపాధ్యక్షుడిగా వై మోహన్, కోశాధికారిగా సతీశ్, మహిళా కార్యదర్శిగా సునీత ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్‌పీడీసీఎల్ కంపెనీ సెక్రెటరీ సుదర్శన్, ఫైనాన్స్ సెక్రెటరీ దేవేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అకౌంట్స్ అధికారులు ఈశ్వర్, గంగారాం, సురేశ్, రమణ, మంగ్త్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


