రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పెర్కిట్: మామిడిపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్‌వో పవన్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, నాయకులు రాజయ్య, దుర్గయ్య, విద్యా సాగర్ రెడ్డి, రాజ్ కుమార్, నరేందర్, రాజేశ్, సునీత, సంతోష్ ఠాకూర్, నాగేశ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


