నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్‌’ రాజు | Dil Raju Launched Trailer of Rakshasa Kavyam Movie | Sakshi
Sakshi News home page

నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్‌’ రాజు

Sep 20 2023 6:04 AM | Updated on Sep 20 2023 8:11 PM

Dil Raju Launched Trailer of Rakshasa Kavyam Movie - Sakshi

∙అభయ్, దాము, ‘దిల్‌’ రాజు 

‘‘రాక్షస కావ్యం’ ట్రైలర్‌ బాగుంది. శ్రీమాన్‌ మేకింగ్, టేకింగ్‌ బాగున్నాయి. కొత్తవాళ్లతో ప్రోడ్యూసర్‌ దాము మంచి ప్రయత్నం చేశాడు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. అభయ్‌ నవీన్, అన్వేష్‌ మైఖేల్, పవన్‌ రమేష్, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతోంది.

ఈ సినిమా ట్రైలర్‌ను ‘దిల్‌’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కరోనా తర్వాత ఓటీటీలో నెగిటివ్‌ కంటెంట్‌ బాగా పెరిగింది.. అదే సక్సెస్‌ అవుతోంది. నేను పాజిటివ్‌ కథతో ఓ మంచి సినిమా తీసినా చూడరేమో? అనే భయం కలుగుతోంది. ఎప్పుడూ హీరోలే గెలవాలా? విలన్లు గెలవొద్దా అనే పాయింట్‌తో ‘రాక్షస క్యావం’ చేశారు. నేటి ట్రెండ్‌కి, ప్రేక్షకులకు కావాల్సిన సినిమా ఇది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement