కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌ | Congress Leaders Fires On KTR: Telangana | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

Dec 27 2025 3:12 AM | Updated on Dec 27 2025 3:12 AM

Congress Leaders Fires On KTR: Telangana

సీఎం రేవంత్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు

తోలు తీస్తా అని మీ నాన్న అన్నందుకే మా సీఎం మాట్లాడారు

మీడియాతో వేర్వేరు చోట్ల మల్లు రవి, చామల, ఆది శ్రీనివాస్, సత్యం, బల్మూరి

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యా ఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొట్టాలని అనిపిస్తోందంటూ కేటీఆర్‌ మాట్లాడడా న్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావులు శుక్రవారం వేర్వేరు చోట్ల విలేక రులతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. 

బూతు పురాణాన్ని పరిచయం చేసిందే మీరు: ఆది శ్రీనివాస్‌
అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచ యం చేసిందే బీఆర్‌ఎస్‌ నేత లని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ వ్యాఖ్యానించారు. తోలు తీస్తానని కేసీఆర్‌ అనడం వల్లనే రేవంత్‌రెడ్డి స్పందించారని చెప్పా రు. ‘అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్, సర్పంచ్‌ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. మీరు తిట్లు ఆపకపోతే మా వైపు నుంచి కూడా రియాక్షన్‌ చూడాల్సి వస్తుంది. మాటకు మాట జవాబు ఇస్తాం’అని ఆది శ్రీనివాస్‌ హెచ్చరించారు. 

చేతలతోనే సమాధానమిస్తాం: మేడిపల్లి సత్యం
సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడిన మాటలు చూసి యావత్‌ తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారని మేడిపల్లి సత్యం అన్నారు. అమెరి కాలో చదివానని చెప్పుకునే ఆయన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. ‘ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టారు. అయినా సిగ్గూ, శరం లేకుండా ముఖ్యమంత్రిపై అవాకులుచెవాకులు పేలుతు న్నారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ అన్న మాటలు వెనక్కి తీసుకోకపోతే ఆయన్ను తెలంగాణలో తిరగనీయం’అని సత్యం హెచ్చరించారు. 

ఇంకా సిగ్గురాలేదా: బల్మూరి
కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డా రు. తెలంగాణ ప్రజలు చెప్పు లతో కొట్టినా, సిగ్గు లేకుండా కేటీఆర్‌ ఇంకా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. ‘నీకు, మీ అయ్యకు సిగ్గూశరం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. మా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న పనులు చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను, నీ అయ్య చెప్పులు అరిగేలా ఇప్పటికే కొట్టారు. మా ముఖ్యమంత్రి పైన ఇంకోసారి మాట్లాడితే సిరిసిల్లలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు’అని వెంకట్‌ చెప్పారు. 

పిచ్చి ఆలోచనలు మానుకోవాలి: చామల
కేటీఆర్‌ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నా రని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి మె రిట్‌ కోటాలో రాజకీయాల్లో గెలిచి సీఎం అయితే, కేటీఆర్‌ మేనేజ్‌మెంట్‌ కోటా లో రాజకీయాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఎవ రిది ఏ కోటానో, ఎవరు ప్రజల పక్షం వహిస్తారో తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పారు. 
నోటికి పని చెప్పడం 

ప్రజాస్వామ్యం కాదు: మల్లు రవి
తాము అనుకున్నట్టే రాజకీ యాలు నడవాలని.. లేదంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతా మనే రీతిలో బీఆర్‌ఎస్‌ నేత లు వ్యవహరిస్తున్నారని నాగ ర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి అన్నారు. రాజకీయా లు హుందాగా నడపాలే కానీ, నోటికి పని చెప్పడం ప్రజాస్వామ్యం కాదని, ఇది రాజకీయా ల్లో మంచి పరిణామం కాదన్నారు. కేసీఆర్, కేటీ ఆర్‌లు పదేపదే సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టినా, ఆయ న సహనం వహించారని, అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement