సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠను రేపింది. మరోవైపు.. కాసేపట్లో ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వద్దకు కేటీఆర్, హారీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణపై చర్చించే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్, మెదక్‌లో హరీష్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ఎర్రవల్లి చేరుకుంటారు. అయితే, సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. రేపు సిట్ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్దమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రేపు తెలంగాణభవన్‌కు రావాలని బీఆర్‌ఎస్ సూచించింది.


