ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సిట్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ఒక్కడినే జూబ్లీహిల్స్ పీఎస్‌లోకి అనుమతించారు. #PhoneTappingCase
హరీష్‌రావు, ఇతర కీలక నేతలు, పార్టీ శ్రేణులు బయటే ఉండిపోయాయి. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. #KTR
అంతకు ముందు.. తెలంగాణ భవన్‌లో ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని అన్నారాయన.
అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని.. నోటీసులు, విచారణ అంతా రాజకీయ డ్రామా అంటూ రేవంత్ సర్కార్‌ను విమర్శించారు.


